Home  »  TV News  »  Illu illalu pillalu: విశ్వ, అమూల్యల పెళ్ళికి కారణం శ్రీవల్లి అని తెలుసుకున్న ప్రేమ, నర్మద!

Updated : Feb 6, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-387 లో.. రామరాజు హాస్పిటల్ లో ఉండటంతో ప్రేమ, ధీరజ్, వేదవతితో పాటు కుటుంబమంతా భాదపడుతారు. ధీరజ్, ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటారు. అమూల్య అలా చేసిందంటే ఎవరం నమ్మలేకపోతున్నామే.. తన వెనుక ఎవరో ఉన్నారని ధీరజ్ కోపంగా అంటాడు. వీడికి ఎలాగైనా నేనే నిజం చెప్పాలని ప్రేమ అనుకుంటుంది. అదే సమయంలో అమూల్య ఆటోలో దిగి పరుగున హాస్పిటల్ లోపలికి వెళ్తుంది.

ఇక అమూల్య పరుగున వెళ్ళడం వేదవతి చూసి తనని వేగంగా బయటకు తీసుకొస్తుంది. నీ వల్లే ఆయనకి అలా ఉందని వేదవతి చెప్తూ అమూల్యని బయటకు గెంటేస్తుంది. నువ్వు అలా లేచిపోవడం వల్లే ఆయనకి అలా ఉందని వేదవతి అనగానే.. ఒక్కసారి నాన్నని చూస్తాను అమ్మ అని అమూల్య అంటుంది. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసాడే.. ఎంత నమ్మాను నిన్ను.. అంటు వేదవతి ఏడుస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు.. నీ వల్లే ఆయనకి ఈ పరిస్థితి అని వేదవతి అంటుంది. ఇక అమూల్యని వదిలేసి అందరు లోపలికి వెళ్తారు. మరోవైపు ఆనందరావు, భాగ్యం ఇద్దరు కలిసి భద్రవతి ఇంటికి దొంగ చాటుగా వెళ్తారు. ఇక వారిద్దరిని భద్రవతి, సేనాపతి చూసి కాసేపు ఆడుకుంటారు. ఆ తర్వాత ఎందుకు వచ్చారు.. ఏంటి విషయం అని ఆ ఇద్దరిని భద్రవతి అడుగగా.. ఆనందరావు తడబడతాడు. ఇక భాగ్యం మధ్యలో కల్పించుకొని.. అదే విశ్వ, ప్రేమల పెళ్ళికి మాకు ఏంటి సంబంధం లేదని అమూల్యతో చెప్పడానికి, తను మా గురించి ఎవ్వరికి చెప్పొద్దని చెప్పడానికి వచ్చామని భాగ్యం అనగానే.. తనకి చెప్పాలంటే తను ఇంట్లో ఉండాలి కదా అని భద్రవతి అంటుంది. ఎక్కడికి వెళ్ళిందని భాగ్యం అడుగగా.. వాళ్ళ నాన్నని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళిందని భద్రవతి, సేనాపతి చెప్తారు. దాంతో‌ ఇద్దరు షాక్ అవుతారు.

ఇక మరోవైపు హాస్పిటల్ బయట ఉన్న అమూల్య సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇక ప్రేమ, నర్మద చూసి తనని ఆపుతారు. ఏం అయిందని అడుగగా.. నాన్న ఈ పరిస్థితులలో ఉండటానికి నేనే కారణం.. నేను బ్రతకను అని అమూల్య అంటుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్.. కొన్నిరోజులకి అదే సెట్ అవుతుందని నర్మద, ప్రేమ నచ్చజెప్తారు. అయితే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఆ ముందురోజు రాత్రి నువ్వు విశ్వని కలవకపోతే ఇదంతా జరిగేది కాదని నర్మద అంటుంది. దాంతో అమూల్య టెన్షన్ అవుతుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్.. ఆ రోజు ఏం జరిగిందని అమూల్యని నర్మద, ప్రేమ అడుగుతారు‌. నేను విషయం చెప్పాక ఎవరి మీదకి గొడవకి వెళ్ళొద్దు.. ఎవ్వరిని ఏం అనొద్దు అని అమూల్య అంటుంది. సరే అని ఇద్దరు మాటిస్తారు. ఇక ఆ ముందురోజు శ్రీవల్లి, భాగ్యం కలిసి తనని బయటకి తీసుకొని వచ్చిన విషయం చెప్తుంది అమూల్య. అసలు విశ్వని ప్రేమించడానికి కారణం శ్రీవల్లి వదిన అని అమూల్య చెప్పగానే ప్రేమ, నర్మద షాక్ అవుతారు. అమ్మ ఇదంతా వల్లి పని ఆ అని ఇద్దరు తన అంతు చూడాలని అనుకుంటారు. గొడవ పడనని నాకు మాటిచ్చారని అమూల్య అనగానే.. ఇంకా ఏం మాట.. మన ఇంటిపరువు తీయడానికి కారణం అయింది దాని అంతు చూస్తా అని ప్రేమ అనగానే నర్మద, అమూల్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.